LTC: ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఎల్​టీసీ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే అవకాశం

by S Gopi |
LTC: ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఎల్​టీసీ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే అవకాశం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై తేజస్, వందే భారత్, హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి అనేక అభ్యర్థనలను స్వీకరించిన తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్త ఆర్డర్ ప్రకారం.. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు తమ ప్రయాణానికి అవసరమైన అర్హతల ఆధారంగా రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లతో పాటు ఈ ప్రీమియం రైళ్లలో కుడా ప్రయాణించవచ్చు. ఎల్టీసీ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవుతో పాటు తమ ప్రయాణ టికెట్ ఖర్చులకు సంబంధించి రియంబర్స్‌మెంట్ పొందవచ్చు.

Advertisement

Next Story