Rohit Sharma : రోహిత్‌ టెస్ట్‌ల్లో ఆడటం కష్టమే.. : బ్రెట్ లీ

by Sathputhe Rajesh |
Rohit Sharma : రోహిత్‌ టెస్ట్‌ల్లో ఆడటం కష్టమే.. : బ్రెట్ లీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో ఆడటం కష్టమే అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు బుధవారం బ్రెట్ లీ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడాడు. ‘రోహిత్ టెస్ట్‌ల్లో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వడం కష్టం. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పరుగులు చేయడానికి రోహిత్ ఇబ్బంది పడ్డాడు. బంతి బ్యాట్‌పైకి వచ్చే వరకు రోహిత్ ఆగలేదు. రోహిత్ గొప్ప ఆటగాడు. కానీ అందరికీ ముగింపు పలకాల్సిన సమయం వస్తుంది. రోహిత్ తన సహజమైన ఆటతీరుతో ఆస్ట్రేలియాలో రాణించలేదు. సిడ్నీ టెస్ట్‌లో తనంతటా తానే బెంచ్‌కు పరిమితం కావడంతో నేను షాక్‌కు గురయ్యాను. అది సరైన నిర్ణయం కాదు. కెప్టెన్ బెంచ్‌కు పరిమితం కావాలనే నిర్ణయం కఠినమైంది. అయితే జట్టుకు ప్రాధాన్యత ఇచ్చి అతను ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.’ అని బ్రెట్ లీ అన్నాడు.

Advertisement

Next Story