ICC Champion Trophy : కుల్దీప్ అన్‌ఫిట్ అయితే రేసులో ఆ ఇద్దరిలో ఒకరికి చాన్స్!

by Sathputhe Rajesh |
ICC Champion Trophy : కుల్దీప్ అన్‌ఫిట్ అయితే రేసులో ఆ ఇద్దరిలో ఒకరికి చాన్స్!
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి భారత్ స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయం దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ రేసులో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు బుధవారం వివరాలు వెల్లడించాయి. గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా కుల్దీప్‌ యాదవ్‌కు గజ్జల్లో గాయమైన విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ప్రకటించే నాటికి ఫిట్ నెస్ టెస్ట్ ఇవ్వాలని కుల్దీప్‌ను బీసీసీఐ మెడికల్ టీం కోరింది. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ప్రస్తుతం విజయ్ హాజారే ట్రోఫీలో పాల్గొంటున్నారు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా వరుణ్ నిలిచాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. బిష్ణోయ్ 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి లిస్ట్‌లో పదో స్థానంలో నిలిచాడు. వరుణ్ చక్రవర్తి, బిష్ణోయ్‌లు టీ20ల్లో రాణిస్తున్నారు. బిష్ణోయ్ కేవలం ఒకే ఒక వన్డే ఆడగా.. వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు ఒక్క వన్డే ఆడలేదు. అయితే భారత్‌కు స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్‌ రూపంలో కీలక ఆటగాడు అందుబాటులో ఉండటం ఊరట కలిగించే అంశం.

Advertisement

Next Story