- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
పసుపు రైతులకు యాంత్రీకరణ పనిముట్లు రాయితీపై ఇవ్వాలి: కోదండరెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : పసుపు రైతులకు యాంత్రీకరణ లో భాగంగా వ్యవసాయ పనిముట్ల రాయితీపై ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కోరారు. బుధవారం లేఖలో పేర్కొంటూ ఈనెల 9న నిజామాబాద్ జిల్లా పర్యటన చేపట్టి పసుపు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి రైతు కమిషన్ బృందం, అధికారులు వెళ్లామన్నారు. పంట పొలాల్లో పసుపు రైతులతో ముఖాముఖీ చర్చిస్తే వారు పంట పెట్టుబడి పెరుగుతుందని పసుపుకు న్యాయమైన ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా పసుపు రైతులకు యాంత్రీకరణ లేకపోవడంతో పండిన పసుపును భూమిలో నుంచి తీయడం, మొక్క నుండి పసుపు వేరు చేసిన తర్వాత పసుపు ఆరబోయడానికి కలాలు లేవన్నారు. పసుపును బాయిల్ చేయడానికి సరైన యంత్రాలు లేక పాత పద్ధతుల్లోనే కట్టెలతో మంటపెట్టి పసుపును మరగబెడుతున్నారని, పసుపు పాలిష్ యంత్రాలు లేక తగినంత మోతాదులో పసుపు పాలిష్ పెట్టలేకపోతున్నారని చెప్పారు.
పసుపు పంటలు దేశంలోనే పెద్ద మొత్తంలో సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో పాత పద్ధతిలో వ్యవసాయం చేయడంతో కూలీల కొరతతో ఆధునాత యంత్రాలు లేక పెట్టుబడి పెట్ట లేక రైతులు నష్టపోతున్నారని వెల్లడించారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి 40 ఎకరాల భూమిని పసుపు విత్తన పరిశోధనకు కేటాయించారని గుర్తు చేశారు. అప్పడే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరామన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారాయయని,. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కానీ పసుపు పండించే రైతుల పరిస్థితి బాగుపడలేదన్నారు. ఇప్పటికైన రేవంత్ ప్రభుత్వం పసుపు పండించే రైతులకు యాంత్రీకరణ లో భాగంగా పనిముట్లను రైతులకు రాయితీ పై అందించాలని కోరారు.