Vijay Hazare Trophy 2024 : ఫైనల్‌కు కర్ణాటక.. మెరిసిన దేవ్‌దత్ పడిక్కల్

by Sathputhe Rajesh |
Vijay Hazare Trophy 2024 : ఫైనల్‌కు కర్ణాటక.. మెరిసిన దేవ్‌దత్ పడిక్కల్
X

దిశ, స్పోర్ట్స్ : కర్ణాటక జట్టు విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. బుధవారం వడోదరా వేదికగా కొతంబి స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్, రవిచంద్రన్ స్మరణ్‌లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో హర్యానాపై కర్ణాటక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 237 పరుగులు మాత్రమే చేసింది. హిమాంషు రాణా (44), అంకిత్ కుమార్(48) పర్వాలేదనిపించారు. అభిలాష్ శెట్టి 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక ఎక్కడా తడబడకుండా 47.2 ఓవర్లలో 238 పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. పడిక్కల్ (86), ఆర్. స్మరణ్(76) కర్ణాటక విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ విజయంతో కర్ణాటక 2019-20 తర్వాత ఫైనల్‌కు చేరినట్లయింది. విదర్భ వర్సెస్ మహారాష్ట్ర మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుతో కర్ణాటక శనివారం ఫైనల్‌లో తలపడనుంది.

Advertisement

Next Story