- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Political Dinner: పోచారం నివాసంలో హాట్ టాపిక్‌గా పొలిటికల్ డిన్నర్.. హాజరైన సీఎం రేవంత్
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు బుధవారం రాత్రి విందుకు హాజరయ్యారు. బీఆర్ఎస్‌లో సీనియర్ లీడర్‌గా ఉన్న మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కంటే ముందు, ఆ తర్వాత కూడా పలువురు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికీ పోచారం గురువారం రాత్రి విందు ఇచ్చారు. ఆయన ఆహ్వానం మేరకు సీఎం రేవంత్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా అందులో తొమ్మిది మంది ఈ విందుకు హాజరయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాత్రం హాజరు కాలేదు.
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం కేటీఆర్‌తో భేటీ అయ్యి అసెంబ్లీలోని ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వీడి ఘర్ వాపసీ తరహాలో మళ్లీ బీఆర్ఎస్‌కు చేరినట్లయింది. ఈ కారణంగా ఆయన పోచారం నివాసంలో జరిగిన డిన్నర్ మీటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. మిగిలిన ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా వారితో పాటు ఉన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాడివేడిగా వాదనలు జరిగిన గంటల వ్యవధిలో డిన్నర్ మీటింగ్‌ను పోచారం శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేయడం గమనార్హం. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా రెండు వారాలు తిరగక ముందే మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో ఈ డిన్నర్ పార్టీకి ప్రాధాన్యత చేకూరింది.