- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGSPDCL, TGNPDCL : ఈదుకుంటూ వెళ్లి! వర్షంలో విద్యుత్ సిబ్బంది విధుల నిర్వహణ ఫోటోలు వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యుత్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వర్షంలో కరెంట్ పోల్స్ ఎక్కి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈక్రమంలోనే టీజీఎన్‌పీడీసీఎల్ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది.
తమ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగవద్దని, భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా, రాత్రి పగలను లెక్కచేయకుండా, చెరువుల గుండా ఈదుకుంటూ వెళ్లి తమ విధులు నిర్వహిస్తున్న టీజీఎన్‌పీడీసీఎల్ సిబ్బంది అంకిత భావానికి జోహార్లు అని పేర్కొంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ప్రతికూల వాతావరణంలో పునరుద్ధరణ చర్యలు చేస్తున్న సిబ్బంది.. అంటూ పేర్కొంది.