Phone Tapping Case: రాష్ట్రాన్ని షేక్ చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు.. సెలబ్రిటీల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో తెలుసా?

by Shiva |
Phone Tapping Case: రాష్ట్రాన్ని షేక్ చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు.. సెలబ్రిటీల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలను కూడా సేకరించారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌‌రెడ్డితో పాటు, ఇతర కాంగ్రెస్ నాయకులు, రియాల్టర్లు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లుగా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ పోలీసు ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేవలం పొలిటికల్ లీడర్ల ఫోన్లను మాత్రమే ట్యాప్‌ చేశారా లేక ఇతరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ గురయ్యాయా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అదేవిధంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దల కదలికపై కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు గురైన వారిలో రాజకీయ నాయకులు, బిజినెస్ పర్సన్స్, సినిమా యాక్టర్ల ఫోన్లను కూడా ట్యాప్‌ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, అందులో ఎక్కువగా హీరోయిన్ల ఫోన్ నెంబర్లే ఉండటం సంచలనం సృష్టిస్తోంది. అంతే కాకుండా ఫోన్ ట్యాపింగ్‌‌ను ఆసరాగా చేసుకుని నిందితులు ఓ రాజకీయ పార్టీకి ఎక్కువ మొత్తంలో డబ్బు సమకూర్చినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed