'బీఆర్ఎస్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు'

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-14 07:30:17.0  )
బీఆర్ఎస్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
X

దిశ, సొన్: మండలం‌లోని మాదాపూర్ గ్రామంలో శక్తి కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించడానికి ప్రజాగోస బీజేపీ భరోసా పేరుతో గ్రామాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ 11 వేల కేంద్రాల్లో కార్నర్ మీటింగులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చి ధనిక రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద భారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మోపాడన్నారు. కేంద్రం గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్ల రూపాయలు విడుదల చేస్తే వాటిని దారి మళ్లించి అభివృద్ధికి ఆటంకం కల్పించడం జరుగుతోందన్నారు. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులే చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడడం కూలి పనులు చేసుకుంటూ సర్పంచులకు రాజీనామాలు చేయడం జరుగుతోందన్నారు.

15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా నరేంద్ర మోడీ నేరుగా నిధులు పంపి రోడ్లు మురికి కాలువలు స్వచ్ఛభారత్ మరుగుదొడ్లు పాఠశాలలో వాటర్ ట్యాంకులు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు ఇలా అనేక వసతులు కల్పిస్తుంటే కేసీఆర్ దొంగ చాటున గ్రామాలకు వచ్చిన నిధులను మళ్లిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, గిరిజనులకు 10% రిజర్వేషన్లు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు, ప్రతి ఇంటికి మంచినీరు, కేజీ టు పీజీ అనేక వాగ్దానాలు విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జి మేకల మల్లేష్ యాదవ్, పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు సంత సాయరెడ్డి ,పడాల నవీన్ యాదవ్ ,బిజెపి అసెంబ్లీ కన్వీనర్ నాయుడి మురళీధర్ , మండల అధ్యక్షుడు మ్యక ప్రేమ్ కుమార్ , దళిత మోర్చ జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, గ్రామ ఉప సర్పంచ్ బంటు ముత్యం ,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

వైరా బీఆర్ఎస్‌కు మరో షాక్.. మరికొన్ని గంటల్లో పెను రాజకీయ మార్పులు..?

హిండెన్ బర్గ్ - అదానీ అంశంపై తొలిసారి స్పందించిన అమిత్ షా.. ఏమన్నారంటే?

Advertisement

Next Story

Most Viewed