- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ప్రభుత్వంలో.. ప్రజలు భరోసాతో ఉన్నారు: డిప్యూటీ సీఎం భట్టి
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న వేళ.. ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆరోగ్య ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని.. ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సేవలను కొనియాడారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఏ శాఖకు నిధులు ఆలస్యం అయినా.. ఆరోగ్య శాఖకు మాత్రం ప్రతి నెల.. కచ్చితమైన తేదీలో నిధులు విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా భట్టి చెప్పుకొచ్చారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆరోగ్య సమస్యలు వస్తే.. ఆస్పత్రుల్లో చూపించుకోవడానికి డబ్బులు లేక ప్రాణాలు విడిచిపెట్టారని.. ఆ పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో లేవని.. ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రతి పౌరునికి ఏడాదికి రూ. 10 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని గుర్తు చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా.. ప్రజల ఆరోగ్యంపై మరిన్ని చర్యలు తీసుకుంటున్నమని.. కానీ బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.