ఆదివాసులకు పెద్దన్నగా జర్నలిస్ట్ రాజిరెడ్డి

by Mahesh |
ఆదివాసులకు పెద్దన్నగా జర్నలిస్ట్ రాజిరెడ్డి
X

దిశ, బ్యూరో కరీంనగర్: వృత్తి జర్నలిస్ట్.. ప్రవృత్తి ప్రజా సేవ.., ఓ వైపు జర్నలిస్టుగా తన వృత్తిని సాగిస్తూనే మరోవైపు తన ప్రత్యేక ఆలోచన అయిన ప్రజా సేవను సాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ప్రత్యేకతను చాటుతున్నారు జర్నలిస్ట్ రాజిరెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం లోని కూచన పల్లి గ్రామానికి చెందిన మడప రాజిరెడ్డి ప్రముఖ ఛానెల్లో సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. తనకు ఉన్న పరిచయాలతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. కూచనపల్లి గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గ్రామంలో ఆదివాసులకు అండగా నిలిచారు. వాళ్లకు ఉండడానికి కనీస సౌకర్యాలతో ఇండ్లు కూడా లేవు. వాళ్ల పరిస్థితిని గ్రహించిన రాజిరెడ్డి సౌకర్యవంతంగా ఉండడానికి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. వాళ్లకు ఇచ్చిన హామీ మేరకు మొదటగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నియోజకవర్గ ఫండ్స్ రూ.5 లక్షల నిధులు మంజూరు చేయించారు.

అయితే కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి వాళ్లకు స్థలం కూడా లేని పక్షంలో నాటి ఎమ్మెల్యే సతీష్ బాబు, కలెక్టర్ జీవన్ పాటిల్‌తో మాట్లాడి ఆదివాసీ భవన నిర్మాణానికి 10 గుంటల భూమి ఇప్పించారు. అనంతరం ఎంపీ, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో మాట్లాడి మిగతా రూ.5లక్షల పెండింగ్ నిధులు మంజూరు చేయించారు. అయితే త్వరలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా కమ్యూనిటీ హాల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story