Osmania: మంత్రి కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. గాదరి కిశోర్ దిష్టి బొమ్మ దగ్దం

by Ramesh Goud |
Osmania: మంత్రి కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. గాదరి కిశోర్ దిష్టి బొమ్మ దగ్దం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓయూలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. నల్గొండలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లపై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గాదరి కిశోర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గాదరి కిశోర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గుండాలని మండిపడ్డారు. అంతేగాక అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గాదరి కిశోర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story