అధ్వాన్నంగా ఖానాపూర్ రోడ్డు…ఇబ్బందులు పడుతున్న ప్రజలు

by Kalyani |
అధ్వాన్నంగా ఖానాపూర్ రోడ్డు…ఇబ్బందులు పడుతున్న ప్రజలు
X

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామం నుండి ఖానాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. ఖానాపూర్ కు వెళ్లే రోడ్డులో భారీగా గుంతలు ఏర్పడడంతో చిన్నపాటి వర్షానికి రోడ్డు మురికి కుంటలను తలపించేలా తయారవుతుంది. దీంతో ఆ రోడ్డు గుండా ప్రయాణించే ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానీ ఆ రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆ రోడ్డు గుండాప్రయాణించే ప్రజలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఖానాపూర్ కు వెళ్లే రోడ్డు లో ఏర్పడిన గుంతలను కూర్పి వేయించి, ప్రజలు ప్రయాణాలు సాఫీగా చేసుకునేలా మరమ్మత్తులు చేపట్టాలని ఆ రోడ్డు గుండా ప్రయాణించే ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed