- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజాంసాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన రియల్ టర్ల పై చర్యలేవి..?
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్ మూర్ ఏరియాలో జాతీయ రహదారిని ఆనుకొని రియల్ వ్యాపారులైన బోగడ మీది బాజన్న, కొట్టాల గంగాధర్, గుండు సాయన్నలు మున్సిపల్ లో విలీనానికి ముందు గ్రామపంచాయతీ అధికారులు, పాలకవర్గాల చేత లేఔట్ లో పర్మిషన్లు తీసుకున్నారు. అప్పటి పెర్కిట్ కుటార్మూరు గ్రామపంచాయతీ పాలకవర్గం అధికారులు ఆమ్యాన్యాలకు అలవాటు పడి అప్పనంగా ప్రభుత్వ భూమిని సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఓట్లలో కలిపి అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కోట్ల రూపాయల విలువ చేసే నిజాం సాగర్ కెనాల్ ప్రభుత్వ భూమిని అమాయకులైన నిరుపేద ప్రజలకు అమ్మకాలు జరుపుతూ కోట్లకు పడగలెత్తారు.
సుమారు రెండేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అప్పటి ఆర్డీవో శ్రీనివాసులు, అప్పటి ఇరిగేషన్ డీఈ కృష్ణమూర్తిలా చేత మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో జాయింట్ సర్వే చేయించి నిజాం సాగర్ కెనాల్ 82-2-1-2 ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. నిజాం సాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధహస్తాల్లో ఉన్న స్థలాన్ని అధికారులు గుర్తించి సుమారు రెండేళ్లు గడుస్తున్న ఆ రియల్ టర్ల పై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం పట్ల అధికారుల పనితీరుపై ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు వీరేం అధికారులు అంటూ వింతగా అవహేళనగా మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారుల పనితీరు ఈ తీరుగా ఉంటే ప్రభుత్వ స్థలాలకు రక్షణ ఏ విధంగా కలుగుతుందని ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు అధికారుల చర్యల పై ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
కోటార్ మూర్ ఏరియాలోని 63వ నంబర్ జాతీయ రహదారి ప్రక్కన వేలకోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేసుకుని సుమారు నెలకు నాలుగైదు లక్షల వరకు ఆ స్థలాలను లీజులకు ఇచ్చుకొని అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న మూడు ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరంగా ఉంది. ఇలాంటి అక్రమ లీజు టెంపరరీ షెడ్ల నిర్మాణాల దారులకు.. విద్యుత్ శాఖ అధికారులు.. ఎలాంటి అనుమతులు లేకుండా మున్సిపల్ అనుమతి లేకున్నా, మున్సిపల్ ట్రేడ్ లైసెన్సులు సైతం తీసుకోకుండా దర్జాగా వ్యాపారాలు చేసే వారికి విద్యుత్ మీటర్లను కేటాయించి రియాల్టర్లకు సహకారం అందిస్తున్నారు.
రియాల్టర్లు కబ్జా చేసిన ప్రభుత్వ కెనాల్ స్థలం ఎంత అంటే..
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్ మూర్ ఏరియాలోని 63వ నంబర్ జాతీయ రహదారి ప్రక్కన రియాల్టర్ బోగడ మీది భజన 82-2-1-2 నిజాంసాగర్ ప్రభుత్వ కెనాల్ స్థలాన్ని 22-1,40-1,40-2 సర్వే నంబర్ల ఏరియాలో సుమారు 1 ఎకరం 36 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా కు గురైనట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా ఈ రియాల్టర్ కబ్జా పక్కన మరో వెంచర్ నిర్మించిన ఇరువురు రియల్టర్లు కొట్టాల గంగాధర్, గుండు సాయన్నలు వారు కొనుగోలు చేసిన భూమిలో 82-2-1-2 నిజాంసాగర్ ప్రభుత్వ కెనాల్ స్థలాన్ని కలుపుకొని వెంచర్ వేశారు. ఇరువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఔట్ తీయించిన ఆ వెంచర్ లో 18, 19, 20, 21, 22 ప్లాట్ లలో ఇరిగేషన్ ప్రభుత్వ కెనాల్ కు చెందిన సుమారు 850 గజాల స్థలాన్ని కబ్జా చేసుకుని అమాయకులైన నిరుపేదలకు అమ్మకాలు జరిపి కోట్లు దండుకున్నారు. జాతీయ రహదారి ప్రక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా ప్రభుత్వ నిజాంసాగర్ కెనాల్ స్థలాన్ని రియల్ వెంచర్లలో కలుపుకుంటూ అమ్మకాలు జరుపుకుంటున్నారు. ఈ ప్రభుత్వ కెనాల్ స్థలాన్ని రెండు సంవత్సరాల కిందట అధికారులు గుర్తించి ఇప్పటివరకు వారి పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తుండడంపై అధికారుల పనితీరును ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.