- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమ పాలన
దిశ, ఆర్మూర్ : బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన సాధ్యమవు తుందని ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలంలోని రాంపూర్, మిర్దాపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రెండు గ్రామాల ప్రజలు జీవన్ రెడ్డికి డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో , బోనాలతో, వందలాది మంది యువకులు బైక్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో జీవన్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి తిరిగి బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని, మళ్లీ తనను గెలిపించాలని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
తాను ఈ పదేండ్లలో మీ గ్రామాల అభివృద్ధికి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి సంక్షేమం వివరించి భవిష్యత్లో ఇక ముందు చేయబోయే పనుల గురించి, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమ పాలన సాధ్యం అన్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ అని అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ రాజ్యం కేసీఆర్ తోనే సాధ్యమవు తుందన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ సంక్షోభమే అన్నారు. బీఆర్ఎస్ స్కీము లను కాపీ కొట్టి వదిలిన తాడులేని బొంగరాలే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలని పేర్కొన్నారు. అవకాశవాద కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకోవాలని, హస్తాన్ని నమ్మితే సమస్తం గోవిందా అని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్న తనను మళ్లీ గెలిపించి అసెంబ్లీకి పంపండి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు సౌడ సాయిలత మధువర్మ, బంటు దయానంద్, ఎంపీటీసీ నడుకుడ భూదేవి భూమన్న, మాజీ ఎంపీటీసీ ఏనుగు సాయి రెడ్డి, రాంపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు గంగాధర్, నాయకులు పాల్గొన్నారు.