- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్లక్ష్యం నీడన గ్రామాభివృద్ధి..
దిశ, పిట్లం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామాల అభివృద్ధి పనులు పిట్లం మండల కేంద్రంలో నత్తకు నడకన కొనసాగుతున్నాయి. పిట్లం మండల కేంద్రంలో 12 కోట్లతో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ పనులను నిర్వహించడంలో.. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్లు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా.. ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ప్రారంభించి నెలలు గడుస్తున్న పనుల నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. పిట్లం మండల కేంద్రంలో పాత నేషనల్ హైవే 161 వెళ్లడంతో.. రోడ్డుకు ఇరువైపులా అనేక దుకాణ సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డుకు సెంటర్ లైటింగ్ కారణంగా.. దుకాణాలకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్ణయించిన దూరంను పాటించకపోవడంతో.. ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నారు. సదరు కాంట్రాక్టర్ దుకాణం దారులు కాంట్రాక్టర్ తవ్విన స్థలానికి మించి ముందు ఉన్న రోడ్డుపై దుకాణం స్టాల్ ఏర్పాటు చేయడంతో.. ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను సదరు కాంట్రాక్టర్లు నిరుగారుస్తురన్న అభిప్రాయం ప్రజల్లో వెలబడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.