అకాల వర్షం..తడిసిన ధాన్యం..

by Naveena |
అకాల వర్షం..తడిసిన ధాన్యం..
X

దిశ ,నాగిరెడ్డిపేట్ : మండలంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన అకాల భారీ వర్షానికి రైతులు ఆరబెట్టిన ధాన్యంలోకి వర్షపు నీరు చేరింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతన్నలు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయి రైతులు ఆగమాగం అయ్యారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గత వారం రోజులుగా రైతన్నలు వరి పంట కోతలు ప్రారంభించి..వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో ఆరబోసుకున్నారు. అకాల వర్షాలతో చేతికి వచ్చిన ధాన్యం తడిసి పోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను నామమాత్రంగా ప్రారంభించినప్పటికీ తూకం వేయడం మాత్రం ప్రారంభించకపోవడంతో..వరి ధాన్యం రాశులు కొనుగోలు కేంద్రాలలో కుప్పలు కుప్పలుగా పేరుక పోయాయని రైతులు వాపోయారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి ధాన్యం తూకం వేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతన్నలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed