నీ కొడుకు రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు.. వదిలేయడానికి బేరం మాట్లాడుకుందాం

by Mahesh |   ( Updated:2024-08-19 09:17:19.0  )
నీ కొడుకు రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు.. వదిలేయడానికి బేరం మాట్లాడుకుందాం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సైబర్ నేరస్తులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్‌గా చేసుకుని ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. క్రైమ్ కేసులో మీ వాళ్లను అరెస్టు చేశామని వదిలేయాలంటే బేరం మాట్లాడుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సైబర్ కేటుగాడు ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసి బెదిరించాడు. అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసిన కేసులో నీ కొడుకును అరెస్టు చేశామని, వాడిప్పుడు సీబీఐ కస్టడీలో ఉన్నాడని చెప్పాడు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంకు చెందిన ఓ వ్యక్తికి సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో +923015447776 నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.

సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ స్పెక్టర్ అర్జున్ కుమార్ ఎంఆర్ 3598 గా ఫోన్‌లో అవతలి వ్యక్తి పరిచయం చేసుకుని బెదిరింపు స్వరంతో మాట్లాడాడు. రమేష్ నీ కొడుకేనా అని అడిగాడు. వాడు ఇప్పుడెక్కడున్నాడో తెలుసా? అని ప్రశ్నిస్తూనే మా కస్టడీలోనే ఉన్నాడని చెప్పాడు. ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసిన కేసులో నలుగురితో పాటు అరెస్టు చేశామని చెప్పాడు. నీ కొడుకు మీద కేసు కావొద్దు.. జైలుకు పంపొద్దనుకుంటే మాతో త్వరగా ఇచ్చి పుచ్చుకునే విషయాలు మాట్లాడాలని బెదిరించాడు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా అబ్బాయి ఎక్కడున్నాడని బాధితుడు అడిగితే, టైం వేస్ట్ చేస్తే కేసు కట్టి నీ కొడుకును జైల్లో వేస్తానని, మళ్లీ బైటికి రాకుండా చేస్తానని ఫోన్‌లో గట్టిగా బెదిరించాడు. టైం వేస్ట్ చేయకుండా త్వరగా బేరం మాట్లాడాలని సైబర్ కేటుగాడు బాధితుడిపై ఒత్తిడి చేశాడు.

నా కొడుకు చదువు కోవడానికి వెళ్ళాడు. వాడు మీ దగ్గరెందుకుంటాడని అనుమానం వ్యక్తం చేసిన తండ్రిని నమ్మించడానికి స్టేషన్ లో కానిస్టేబుళ్లతో బాధితుడి కొడుకును స్టేషన్‌లో బాగా కొట్టిస్తున్నట్లు, ఏడిపిస్తున్నట్లు ఫోన్‌లో అబ్బాయి ఏడుపులు వినిపించాడు. మా బాబు ముంబైలో ఉంటాడు. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారని ఆరా తీసే ప్రయత్నం చేయగా, ముంబై‌లోని బాండ్రా సీటీ నుంచి మాట్లాడున్నానని కోపంగా చెప్పాడు. మీరు ఎవరు మాట్లాడేది అని మరోసారి అడిగితే నీ కొడుకును ఏం చేయమంటావో ముందు అది చెప్పాలంటూ సైబర్ కేటుగాడు కోపంగా అరిచాడు. అప్పటికే ఆ కాల్ సైబర్ నేరస్థుడు నుంచి వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుని ఆ తండ్రి బద్మాష్.. నేను కూడా పోలీస్ ఆఫీసర్‌నే మాట్లాడుతున్నాన్రా.. నీ సంగతి తెలుస్తానుండు.. అని గట్టిగా బెదిరించడంతో అవతల వ్యక్తి వెంటనే కాల్ కట్ చేసినట్లు బాధితుడు తెలిపారు.

ఆడియో కోసం ఈ కింద క్లిక్ చేయండి


Advertisement

Next Story

Most Viewed