- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన పీసీసీ చీఫ్
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పీసీసీ(PCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు, ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే జిల్లాకు మరో వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా నియమితులైన వేణు బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం తప్పక నెరవేర్చుతుందని హామీ ఇచ్చారు. గ్రూప్ 1 అభ్యర్థులను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టాయని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు, విద్యార్థులకు ఓ మంచి విషయం ప్రకటిస్తున్నాను అని తెలిపిన పీసీసీ చీఫ్.. త్వరలోనే మరొక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రజలకు నాణ్యమయిన వైద్యం అందటంతోపాటు, జిల్లా నుండి ఎంతో మంది డాక్టర్లుగా ఎదిగి, జిల్లాకు మంచి పేరు తెస్తారని పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు, బహుమతులు అందుకునేలా క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం పట్టణంలో అన్ని వసతులతో కూడిన అత్యంత అధునాతన క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.