- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సారూ..స్థలం కావాలి రైతుల కన్నీటి ఆవేదన
దిశ,ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం మోతే గ్రామానికి చెందిన రైతులు నిరసనకు దిగారు. చేతికొచ్చిన పంట ఆరబెట్టుకోవడానికి స్థలం లేక వారం రోజుల నుంచి ఆందోళన చెందుతూ.. శనివారం ఎల్లారెడ్డి ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు. తాడ్వాయి మండలంలోని, మోతే గ్రామానికి చెందిన రైతులు సుమారు 100 మంది పైచిలుకు శనివారం ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నే ప్రభాకర్ ను కలిసి తమ ఆవేదనను వెదజల్లారు. ఆ గ్రామంలో 542 సర్వేనెంబర్ లో ప్రభుత్వ భూమి నాలుగు ఎకరాల 19, గుంటల భూమి ఉన్నప్పటికీ ఆ భూమి లో స్మశాన వాటిక ఉండటంతో గ్రామంలోని కొందరు,మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులు, ఆ స్థలంలో రైతులకు అడ్డుపడుతున్నారని రైతులు వాపోయారు. గ్రామంలోని రైతులకు..పండించిన పంటను ఆరబెట్టుకోవడానికి స్థలం ఇప్పించాలని అధికారులను, ఆర్డిఓ ప్రభాకర్ ను కోరారు. 2000 మంది రైతులు ఆ గ్రామంలో వ్యవసాయ మీద ఆధారపడి ఉన్నామని రైతులు అధికారులతో తెలిపారు. గ్రామంలో ధాన్యం ఆరబెట్టుకోవడానికి స్థలం లేకపోవడంతో.. గ్రామస్తులు, తీవ్ర అవస్థలు పడుతున్నారని, దయచేసి స్థలాన్ని రైతులకు ఇప్పించాలని ఆర్డీవోకు విన్నవించుకున్నారు. విషయం విన్న ఎల్లారెడ్డి ఆర్డీవో రైతులతో మాట్లాడుతూ.. పక్షం రోజుల్లోగా సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని రైతులకు తెలిపినట్లు ఆ గ్రామ రైతులు పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో,ఎల్లారెడ్డి ఆర్డీవో,ప్రభాకర్,డీఎస్పీ,శ్రీనివాస్ లు,మోతె గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.