- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సారూ... పట్టించుకోరా...!!
దిశ, బాన్సువాడ : శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లి క్రాస్ రోడ్డు వద్ద బస చేశారు. అనంతరం అక్కడి నుంచి, బాన్సువాడ వరకు పాదయాత్ర చేశారు. మార్గమధ్యలో అంకోల్ క్యాంపు వద్ద అంకోల్ గ్రామానికి చెందిన మహిళ రైతు బ్యాంకు లోన్ కు సంబంధించి తన గోడు చెప్పుకుంటే.. భరోసా ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ నేడు భూములను వేలం వేస్తున్నా..పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న రైతులు తమ పొలాల అభివృద్ధి కోసం, బోరుబావులు తవ్వించడం కోసం భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే కాలం కలిసి రాకపోవడం, బోరు పడక పోవడం, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో పలువురు రైతులు అప్పు చెల్లించలేకపోయారు. దీంతో ఏడెనిమిదేళ్ల క్రితం వారు తీసుకున్న అప్పు పెరిగింది. మూడు నాలుగింతలైంది. ఇటీవల బ్యాంకు అధికారులు రుణాల వసూళ్లపై దృష్టి సారించారు. అప్పులు పేరుకుపోయిన రైతులకు నోటీసులు ఇస్తున్నారు. గడువులోగా రుణం చెల్లించలేకపోతే భూములను వేలం వేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 26 న భూములు వేలం వేస్తామని నోటీసులు ఇచ్చారు. కాగా ఆనాడు బకాయిల వసూలు కోసం రైతు ఇంటి తలుపులు తీయడాన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయన హయాంలో ఏకంగా రైతుల భూములను వేలం వేయడానికి సహకార బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అప్పట్లో తమ తరపున మాట్లాడి భరోసా ఇచ్చిన సీఎం..ఇప్పుడు ఆదుకుని తమ పరువు నిలపాలని బాధిత రైతులు కోరుతున్నారు. భూములను వేలం వేస్తే పరువు పోతుందన్న భయంతో కొంతమంది రైతులు బయట అప్పులు చేసి..మరీ సొసైటీ లోన్ చెల్లిస్తున్నారు. సహకార బ్యాంకు అధికారులు ఇంటి తలుపులు తీసుకువెళ్లారని అంకోల్ గ్రామ రైతు వాపోయారు. ప్రభుత్వం 6 శాతం సబ్సిడీ ఇవ్వకపోవడంతో..రూ.3 లక్షలు లోన్ కాస్తా రూ. 6 లక్షలు అయింది. అప్పుకు బదులుగా తలుపులు, సైకిల్ మోటార్, కంప్యూటర్లు తీసుకెళ్లడం జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా రైతుల భూములను వేలం వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సహకార సంఘాలలో రుణాలు తీసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు.