ఒకే వేదికపై ఆ నలుగురు..!

by Sumithra |
ఒకే వేదికపై ఆ నలుగురు..!
X

దిశ, గాంధారి : ఒకరేమో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఇంకొకరేమో టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్మోహన్ రావు, ఇంకొకరు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఇంకొకరు వైఎస్సార్టీపీ ఎల్లారెడ్డి అధ్యక్షురాలు జమున రాథోడ్ అందరూ ఒకే వేదిక పై ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటివి చాలా అరుదుగా జరిగే సందర్భాలు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గిరిజన ఆరాధ్య దైవం సంతు శ్రీ సేవలాల్ మహారాజ్ 284 జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా నిర్వహించే సేవాలాల్ జయంతిని మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి ర్యాలీ తీసి అందులో నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొని గిరిజన సంఘం వరకు చేరుకున్నారు. ఇందులో శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో బోగ్ బండార్ కార్యక్రమంలో అందరు నాయకులు పాల్గొని సేవాలాల్ మహారాజ్ ఎంత కొనియాడిన తక్కువే అని పలువురునాయకులు అన్నారు.

ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా గిరిజన భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతితండాలో సర్పంచ్ వాళ్లే స్వయంపాలన చేసుకునే స్థాయికి ఎదిగారని కొనియాడారు. గిరిజనులు ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారంటే అప్పుడు ఆ రోజుల్లో విద్యపై అవగాహన కల్పించిన చదువు పట్ల ప్రాధాన్యత కారణంగానే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం కేవలం శివలాల్ మహారాజ్, రాంజీ మహారాజ్ అన్న, అలాగే ప్రతి తాండాలు సీసీ రోడ్ల నిర్మాణం కృషి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం అంది అని కొనియాడారు.

టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్మోహన్ మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అలాగే రామారావు మహారాజ్ విగ్రహాన్ని బంజారాలు ఎక్కువగా ఉన్న గాంధారి మండల కేంద్రంలో ప్రతిష్టించాలని అన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ ఉత్సవాలు ఇంత గొప్పగా జరుపుకోవడం ఆనందంగా ఉందని సేవాలాల్ బంజారా సమాజ సేవ కోసం సేవలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమని అన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి వడ్డేపల్లి మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోని అందుకే ఒక్కమాటలో హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పై సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైఎస్సార్టీపీ జమున రాథోడ్ మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ చూపించిన మార్గంలోనే భక్తితో ఎటువంటి చెడు అలవాటులకు వెళ్లకుండా మంచి భక్తి మార్గంలో నడవాలని అదే సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ మనం ఇచ్చే గౌరవం అన్నారు. ఇంతలో గిరిజనులకు ఎటుచూసినా అన్యాయమే జరుగుతుందని పార్టీపరంగా అంశాన్ని లేవనెత్తారు.

Advertisement

Next Story

Most Viewed