శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

by Mahesh |
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
X

దిశ, బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 18,826 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఏఈఈ కె.రవి తెలిపారు. గురువారం 12 గంటలకు 3 వరద గేట్లు ఎత్తి గోదావరి‌లోకి 9,372 క్యూసెక్కులు మిగులు జలాలను విడుదల చేశారు. 5800 కాకతీయ కాలువకు ఉన్న ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 2200 క్యూసెక్కులు, కాకతీయ కాలువతో 6800 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, పూర్తి స్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా గురువారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉందన్నారు. జూన్ 1 తేదీ నుంచి ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి 248.717 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందన్నారు. 175.617 టీఎంసీల మిగులు జలాలను కాలువల ద్వారా, వరద గేట్ల నుంచి గోదావరిలోకి విడుదల చేశామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed