- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో..ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువకు 12,150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా వచ్చి చేరుతుందన్నారు. అలాగే సింగూరు ప్రాజెక్టు ద్వారా 12,150 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా వస్తుందని తెలిపారు. మంగళవారం ఆయన ప్రాజెక్టు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా.. 17.802 టీఎంసీలకు ఉంది. ప్రస్తుతం 1404.92 అడుగులు కాగా.. 17.687 టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతుందన్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో..ప్రాజెక్టు మూడు వరద గేట్లు ఎత్తివేసి 12,150 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.