- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్..ఎవరో తెలుసా.?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయానికి న్యాక్ గుర్తింపు కోసం కృషి చేస్తానని తెలంగాణ యూనివర్శిటికీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి.యాదగిరి రావు అన్నారు. టీయూ కు నూతన వైస్ ఛాన్సలర్ గా ప్రభుత్వం నియమించిన డాక్టర్ యాదగిరి రావు సోమవారం యూనివర్శిటీ పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్ లో పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, కంట్రోలర్, ఆడిట్ సెల్ డైరెక్టర్, డీన్స్, హెడ్స్, చైర్మన్ బిఓఎస్ లతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం వీసీ యాదగిరి రావు మాట్లాడుతూ..ప్రతిష్టాత్మకమైన తెలంగాణ విశ్వవిద్యాలయానికి నాపై నమ్మకంతో నన్ను వీసీగా నియామకం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి యాదిగిరి రావు కృతజ్ఞతలు తెలియజేశారు. విశ్వవిద్యాలయ వనరులు బోధన, బోధనేతర సిబ్బందిని ఉపయోగించుకొని , ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల సహకారంతో.. యూనివర్శిటీకి న్యాక్ గుర్తింపును తీసుకొచ్చి విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాక్ గుర్తింపే ప్రధాన లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని వీసీ సూచించినారు. కాన్వొకేషన్ జరిపిస్తాననన్న ఆయన కాన్వొకేషన్ ఏర్పాట్ల గురించి రిజిస్ట్రార్ యాదగిరితో వీసీ యాదగిరి రావు చర్చించారు. ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యా డివిజన్ లో కలిపేందుకు కూడా కృషి చేస్తానని వీసీ అన్నారు.
యూనివర్శిటీలోని పలు విభాగాలను సందర్శన
నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి, ఆడిట్ సెల్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తో కలిసి ... పరిపాలన భవనంలో పరీక్షల విభాగం, అడ్మిషన్స్ విభాగం, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విభాగం, ఎన్ఎస్ఎస్ సేవా విభాగం, ప్రజా సంబంధాల విభాగం, ఆడిట్ సెల్ తో పాటు.. కళాశాలల బిల్డింగులు, యూనివర్శిటీలోని లైబ్రరీని వీసీ సందర్శించినారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వీసీని సన్మానించిన పలు సంఘాలు
నూతనంగా పదవి బాధ్యతలు ఉపకులపతి ఆచార్య టి యాదగిరిరావును తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీయూటీఏ), కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్, పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్, అప్లియేటెడ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్, నాన్- టీచింగ్ అసోసియేషన్, ఔట్ సోర్సింగ్ అసోసియేషన్లతో పాటు.. పలువురు వీసీని సన్మానించారు.