- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేయర్ భర్తపై సుత్తెతో దాడి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 18: నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త బీఆర్ఎస్ నాయకుడు దండు శేకర్ పై సోమవారం నగరంలో దాడి జరిగింది. నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన రసూల్ అనే ఓ ఆటో డ్రైవర్ దండు శేకర్ పై సుత్తితో బలంగా దాడి చేశాడు. పొడవాటి సుత్తితో తలపై దాడి చేసి తీవ్రంగా గాయ పరచడం తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణాన్ని ఈ ఘటన ఒక్కసారిగా వేడెక్కించి ఉలిక్కిపడేలా చేసింది. నాగారం ప్రాంతంలోని బలహీన వర్గాల కాలనీలోని ఒక ఇంటి స్థలం కబ్జా విషయంలో దండు శేకర్ కు నిందితుడు రసూల్ కు మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రసూల్ కు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని దండు శేకర్ అనుచరులు గోపాల్ గ్యాంగ్ కబ్జాచేశారని, ఈ విషయం చాలా కాలంగా వివాదం నడుస్తున్నట్లు సమాచారం. ఈ స్థల వివాదంపై పలు మార్లు బాధితుడు రసూల్ గోపాల్ గ్యాంగ్ తో మంతనాలు జరిపినా తమ కబ్జాలో ఉన్న జాగాను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారని, ఎవరో చెపితే తాను ఈ విషయమై దండు శేకర్ ను కూడా కలిసి మొరపెట్టుకున్నట్లు కూడా బాధితుడు రసూల్ అన్నారు.
సెల్ఫీ వీడియోలో నిందితుడి ఆవేదన..
దండు శేకర్ పై దాడి చేసిన నిందితుడు రసూల్ శేకర్ పై దాడి తానే చేశానని, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో తన సెల్ఫీ వీడియోలో కారణాలు పేర్కొన్నారు. శేకర్ పై రసూల్ దాడి చేస్తుండగా తీసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన ఆటోలో ఉన్న పొడవాటి సుత్తిని తీసుకెళ్లి రసూల్ శేకర్ పై సుత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన ఇంటి స్థలాన్ని దండు శేకర్ ప్రధాన అనుచరుడైన గోపాల్ అండ్ గ్యాంగ్ కబ్జా చేశారని, తన స్థలాన్ని తనకు ఇప్పించాలని ఎన్నిసార్లు అడిగినా, కడుపులో తల పెట్టి వేడుకున్నా పట్టించుకోలేదని, పైగా కబ్జాచేసిన గోపాల్ గ్యాంగ్ కు సపోర్ట్ చేసేలా రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు రసూల్ ఆరోపించారు. ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకునే తన వద్ద అంత డబ్బెక్కడుంటుందన్నా వినకుండా నా స్థలంలోకి నన్నే వెళ్లొద్దని, కాదని వెళితే చంపేస్తామని శేకర్ తనను బెదిరించినట్లు రసూల్ వీడియోలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ తనకు సపోర్ట్ చేయాలి..
కాంగ్రెస్ కార్యకర్తగా తాను ఎన్నో యేళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తున్నానని, తనకు జరిగిన అన్యాయంపై శేకర్ పై దాడిచేశానని,తనకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలని నిందితుడు రసూల్ కాంగ్రెస్ నాయకులను వేడుకున్నాడు. శేకర్ పై తాను దాడిచేశానని, ఆయన చచ్చాడో బతికాడో కూడా తనకు తెలియదని ఆ వీడియోలో చెప్పుకున్నాడు.దాడిలో తీవ్ర గాయాల పాలైన దండు శేకర్ ను నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. దండు శేకర్ పై దాడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.