ganja : గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

by Sridhar Babu |
ganja : గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
X

దిశ,నవీపేట్ : ఎక్సైజ్ అధికారులు నవీపేట్ మండల కేంద్రంలో దాడులు నిర్వహించి గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న నవీపేట్ కు చెందిన సయ్యద్ రఫీక్ ను

అరెస్ట్ చేసి 500 గ్రాముల ఎండు గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు కలిగివున్నా, సేవించిన వ్యక్తుల పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ ఎస్సై నరసింహ చారి, సిబ్బంది భూమన్న, భోజన్న, అవినాష్, ఉత్తమ్, విష్ణు, రాంబచ్చన్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed