- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాత్ కరోడ్ మే, కామ్ పకోడి మే
దిశ, పిట్లం: బాత్ కరోడమే, కామ్ పకోడీ మే చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే హనుమంత్ షిండే బహిరంగ సభలో అన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ శిష్యశ్యామలం కావడానికి రూ. 470 కోట్లతో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పాదాభివందనాలు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో 11 తండాలకు రోడ్డు నిర్మాణం చేశారు. బిచ్కుంద పిట్లం మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో రెండు బ్రిడ్జిలకుగాను మూడు కోట్ల 40000 రూపాయలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. యువతకు ప్రాధాన్తిస్తూ పరిశ్రమల ఏర్పాటు కూడా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. హనుమంత్ షిండే ఎంతో విద్యావంతుడు, మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంది, మూడుసార్లు గెలిచినా ఆయనకు 72 వేల మెజార్టీతో గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పిట్లం, జుక్కల్ మండలానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేసే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో లింకు రోడ్లను డబుల్ రోడ్లుగా మంజూరు చేయించి వేయిస్తానని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంలో యువతకు ప్రాధాన్యత
మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యువతకు ఎంతో ఇస్తూ వేరే దేశాల నుండి పరిశ్రమల ఏర్పాటుకు సంబంధాలు ఏర్పరచుకుంటూ 20 వేల ఉద్యోగాలను కల్పించిన ఘనత కేటీఆర్ అని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా 25 వేల పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పితం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత వెంట తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారని అన్నారు. గురువారం ఈడీ విచారణకు వెళ్తున్నా కవితను ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరూ ఆలయాలు ప్రత్యేక పూజలు చేయాలని కోరారు.
పథకాల కోసం దేశం ఎదురుచూస్తుంది: సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
భారతదేశంలో 32 పథకాల కొరకు ప్రజలు ఎదురుచూస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఎత్తిపోతకాల పథకం సభలో ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్ నిండుకుండలా ఉండాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మల్లన్నసాగర్ కు మల్లన్న సాగర్ నుండి నిజాంసాగర్ ప్రాజెక్టుకి నీరు వచ్చే విధంగా కాలువలను ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకుపోగా 1500 కోట్ల రూపాయలను మంజూరు చేసి కాలువను చేస్తున్నారని అన్నారు. కాల్వ పనులు జూన్, జూలైలో పూర్తవుతున్నట్లు అని అన్నారు. నిజాంసాగర్ నిండుకుండలా ఉంటే రెండు పంటలు రైతులు పుష్కలంగా పడించుకో విధంగా నీరు అందుతుందని పేర్కొన్నారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జూకల్ నియోజకవర్గంలో ఆకుపచ్చ జుక్కల్ గా 40 వేల ఎకరాలు సాగుతుందని అన్నారు. దేశం కోసం తండ్రి, రాష్ట్రం కోసం కొడుకు ప్రజల కోసము శ్రమిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. సభలో పాల్గొన్న సర్పంచ్ పదమ పౌరురాలు విజయ శ్రీనివాస్ రెడ్డి, నిజాంబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, నిజాంబాద్ ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ శోభ రాజు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అనిన్య, ఎంపీపీ కవిత విజయ్, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.