- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రిడ్జిపై నుంచి వెళ్లాలంటే భయం భయం..ఎందుకో తెలుసా..?
దిశ,గాంధారి: ఎవరైనా చీకటి పడక ముందే ఇంటికి వెళ్లాలనుకుంటారు కానీ.. ఇంటికి వెళ్లే రూట్లో వరుస హత్యలకు చేరువైన ప్రాంతం నుంచి వెళ్లాలంటే కాస్త ఎంత ధైర్యవంతుడైన ముందు వెనక ఆలోచించే వెళ్తాడు. అలాంటి సంఘటన యదార్ధంగా జరిగింది అయితే చీకటి పడితే చాలు ఎవరైనా ఇంటికి తొందరగా చేరుకోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ చీకటి ఎప్పుడు అయితుంది అబ్బా మనం అక్కడికి ఎప్పుడు వెళ్దాం..అబ్బా అని ఆలోచించే వాలే ఎక్కువగా ఉన్నారు. వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో వాగు బ్రిడ్జి నందు చిమ్మ చీకటిగా ఉండడంతో..అటువైపు వెళ్లేవారు గగనంగా మారుతుంది. సాయంత్రం పూట 7 గంటల తర్వాత వెళ్లాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే బ్రిడ్జి పక్కన ఉన్న బావిలో ఒక శవంను వెలికితీయడం కలకలం రేపింది. అంతేకాకుండా మొన్న గుర్తు తెలియని వ్యక్తి వాగులో పడి మృతి చెందిన సంఘటనలతో బ్రిడ్జి వద్దకు వెళ్లాలంటే జనాలు జంకుతున్నారు. ఆ బ్రిడ్జి పేరు వినగానే అందరూ గజగజా వణికి పోతుంటే..దీన్ని కొందరు అదునుగా చేసుకొని బ్రిడ్జి కింద అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసాంఘిక కార్యక్రమాలు బ్రిడ్జి కింద రాత్రి పూట యధేచ్చగా జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
బతుకమ్మ పండక్కి బల్బులు, మిగతా రోజు చిమ్మ చీకటే....
బ్రిడ్జికి దాదాపు అర కిలోమీటర్ దూరం వరకు ఎదుటి నుంచి వచ్చే వ్యక్తి కనిపించిన కనిపించని దుర్భర పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్న గ్రామపంచాయతీ అధికారులు బతుకమ్మ పండగలకు సెంట్రల్ లైటింగ్ లు మీటర్ మీటర్ కు ప్రత్యేకంగా బల్బులు పెట్టించి పండగ కాగానే తీసి మళ్లీ ఎంచక్కా భద్రపరుస్తారు. కానీ గాంధారి నుంచి బ్రిడ్జి అవతల వైపు ఎవరైనా నడుచుకుంటూ వెళ్లాలంటే భయంగా ఉంటుంది. అంతేకాకుండా దాదాపు ఒక కిలోమీటర్ మేర చీకటిగా ఉంటుంది. ఈ విషయంపై చాలాసార్లు గ్రామపంచాయతీ సిబ్బందికి చాల సార్లు విన్నవించిన ప్రయోజనం శూన్యం. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.