న్యూ ఇయర్​ డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు ఎన్ని నమోదయ్యాయంటే..?

by Naveena |
న్యూ ఇయర్​ డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు ఎన్ని నమోదయ్యాయంటే..?
X

దిశ,కామారెడ్డి : జిల్లాలో డిసెంబర్ 31 సందర్భంగా పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో 110 కేసులు నమోదు కాగా 66 వాహనాలు సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కామారెడ్డి డివిజన్ లో 60, ఎల్లారెడ్డి డివిజన్ లో 28, బాన్సువాడ డివిజన్ లో 22 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే 66 వాహనాలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై నుంచి కూడా ఎవరు మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. రహదారి భద్రతా నియమ నిబంధనలను పాటించి ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు,మరణాలు తగ్గే విధంగా పోలీసు శాఖ వారు తీసుకునే చర్యలకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed