- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘరానా దొంగ అరెస్ట్
దిశ, మద్నూర్ : మండల కేంద్రంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రూ 13 లక్షల 50 వేల సొత్తును రికవరీ చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం మద్దూరు మండలంలో నివాసం ఉండే మహాజన్ బాలాజీ ఇంట్లో ఈనెల 26న రాత్రి చోరీ జరిగింది.
బీరువాలో దాచిన 25 తులాల బంగారం, నగదు అపహరణకు గురౌంది. దాంతో ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు బిచ్కుంద శ్రీ నరేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. మద్నూర్ గ్రామానికి చెందిన ఉప్పరివార్ శ్రీను చోరీకి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోగా అతడి నుంచి రూ.13 లక్షల 50 వేల సొత్తును రికవరీ చేశారు. నిందితుడిని రిమాండ్ కి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన బిచ్కుంద సీఐ నరేష్, మద్నూర్ ఎస్ఐ శ్రీకాంత్, పోలీసుల బృందాన్ని అభినందించారు.