వేప చెట్టు కింద తండ్రీకొడుకులు..కొడుకు మృతి ఏమైందంటే..?

by Naveena |
వేప చెట్టు కింద తండ్రీకొడుకులు..కొడుకు మృతి ఏమైందంటే..?
X

దిశ ,నాగిరెడ్డిపేట్ : మండలంలోని బొల్లారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షంలో తండ్రి కొడుకులపై పిడుగు పడింది. దీంతో కొడుకు మృతి చెందగా.. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన మంద వెంకటేష్ (25) అనే యువరైతు తన తండ్రి నాగభూషణంతో కలిసి గ్రామ శివారులోని బద్దికుంట ప్రాంతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసి ఉండగా.. మధ్యాహ్నం వేళ ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో తండ్రి కొడుకులు వేప చెట్టు కింద కూర్చుని ఉండగా చెట్టు పైనుంచి తండ్రి కొడుకులపై పిడుగు పడింది. పిడుగుపాటుకు మంద వెంకటేష్ అక్కడికక్కడే మృతిచెందగా..తండ్రి నాగభూషణం అపస్మారక స్థితిలోకి వెళ్లి గాయాలయ్యాయి. దీంతో గమనించిన స్థానికులు నాగభూషణంను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు వెంకటేష్ కు గత ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. మృతుని భార్య రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. పిడుగుపాటుతో మంద వెంకటేశ్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed