జహీరాబాద్‌లో చెరుకు పంటను పరిశీలించిన తాండూర్ గ్రామ రైతులు

by Mahesh |
జహీరాబాద్‌లో చెరుకు పంటను పరిశీలించిన తాండూర్ గ్రామ రైతులు
X

దిశ, నాగిరెడ్డిపేట్: మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన రైతులు గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నగర శివార్లలోని చెరుకు పంటలను పరిశీలించారు. జహీరాబాద్ ప్రాంతంలో అక్కడి రైతులు చెరుకు పంటలను సరైన మెలకువలతో అత్యధికంగా పండిస్తూ, అధిక దిగుబడులు సాధిస్తుండడంతో.. గాయత్రి చక్కెర కర్మాగారం జనరల్ మేనేజర్ రామారావు తాండూరు గ్రామ రైతులకు జహీరాబాద్ ప్రాంత చెరుకు పంట సాగు తీరును చూపించేందుకు 12 మంది రైతులను తీసుకువెళ్లారు. అక్కడి చెరుకు రైతులతో చెరుకు పంట సాగు, అధిక దిగుబడుల కోసం రైతులు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు, మెలకువలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ రామారావు, ఫీల్డ్ ఆఫీసర్ మహేష్, ఫీల్డ్ మెన్ శ్రీనివాస్, తాండూరు గ్రామ రైతులు సత్యనారాయణ, నాగేశ్వర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, దుర్గయ్య, మల్లేష్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed