నలందలో వీడ్కోలు సంబరాలు..

by Sumithra |
నలందలో వీడ్కోలు సంబరాలు..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ లోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్లో పదవతరగతి విద్యార్థుల వీడుకోలు సంబరాల కార్యక్రమాన్ని అట్టహాసంగా ఆనంద ఉత్సవాల మధ్యలో 9వ,10వ తరగతి విద్యార్థులు జరుపుకున్నారు. 10వ తరగతి విద్యార్థులు తమ బాల్యాన్ని నలంద హైస్కూల్ తో ఉన్న అనుబంధాలను వ్యక్తపరిచారు. ప్రతి ఒక్క విద్యార్థి వారి మనోభావాలను ఉపాధ్యాయులతో తమకున్న ఆత్మీయతను తెలియచేస్తూ రాబోయే రోజుల్లో వారి భవిష్యత్తు ప్రణాళిక తెలియచేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సాగర్ మాట్లాడుతూ పదవతరగతి స్కూల్ లైఫ్ కి ముగింపు కానీ భవిష్యత్తుకి పునాది అన్నారు.

హార్డ్ వర్క్ గురించి తన సొంత అనుభవాలను విద్యార్థులకు తెలియజేస్తూ ఆధునిక కాలంలో ప్రతివిద్యార్థి మాథ్స్, సైన్స్ సబ్జక్ట్స్ పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. తమ విద్యార్థుల నుండి ఒక సైంటిస్ట్ ని చూడాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులకు మరో 20 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో అందరూ ఇష్టపడి చదవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు సినిమా పాటలపై చేసిన ఆకర్షణీయమైన నృత్యాలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నలంద ప్రసాద్, ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed