బీఆర్ఎస్ పార్టీ నేతల వేదింపులపై కలెక్టర్ కు ఫిర్యాదు

by Sumithra |
బీఆర్ఎస్ పార్టీ నేతల వేదింపులపై కలెక్టర్ కు ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దళిత బంధు కుంభకోణం విషయమై తనకి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక దళిత మహిళ మేతరి లక్ష్మి ఆమె భర్తతో కలిసి కామారెడ్డి జిల్లా కలెక్టరేటే ఏవోకు ఫిర్యాదు చేశారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన మేతరి లక్ష్మీ(28) అనే దళిత మహిళకి దళిత బంధు పథకం ద్వారా వచ్చే 10 లక్షల్లో 8 లక్షలు లంచంగా ఇవ్వాల్సి ఉంటుందని లేకుంటే మీకు దళిత బంధు రాకుండా అడ్డుకుంటామని గ్రామ సర్పంచ్ పిట్ల అనసూర్య, ఆమె భర్త సత్యనారాయణలు బెదిరించారన్నారు.

ఈ విషయాన్ని జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మకాంతారావు, లక్ష్మికి విన్నవించుకున్నామన్నారు. ఈ విషయమై తోట లక్ష్మీకాంత రావు, గ్రామస్తులు నాడు ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్ పిట్ల అనసూర్య, ఆమె భర్త సత్యనారాయణ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా, సర్పంచ్ దంపతులు, ఉపసర్పంచ్, ఇతర గ్రామస్తులు మేతరి లక్ష్మి భర్త మేతరి బాల సాయిలును గ్రామకమ్యూనిటీ హాల్ వద్దకు పిలిపించుకొని మాట్లాడిన మాటలన్నీ అవాస్తవమని చెప్పమని వీరిపైన తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చి భయబ్రాంతులకు గురి చేసారని అన్నారు. కలెక్టరేట్ లో బాధితురాలితో పాటు మాజీ జడ్పీటీసీ ప్రదీప్ , కిషోర్,మాజీ ఎంపీటీసీ సాయిలు,నిజాంసాగర్ కాంగ్రెస్ యువనాయకులు అనీస్ లున్నారు.

Advertisement

Next Story

Most Viewed