Balkonda: ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ప్రైవేటీకరణ పిచ్చిపట్టిందంటూ ఆగ్రహం

by srinivas |   ( Updated:2023-11-02 10:53:11.0  )
Balkonda: ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ప్రైవేటీకరణ పిచ్చిపట్టిందంటూ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చిపట్టిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. బోరుకాడ మీటర్లు పెట్టి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిప్డారు. కాంగ్రెస్, బీజేపీకి అధికారం ఇస్తే ఏం చేశారో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ ఇబ్బందులేనని, రైతాంగం ఆగమైందని గుర్తు చేశారు. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిణతి పెరగాలని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పార్టీనే దళితబంధు స్కీమును తీసుకొచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దళితులను గత పాలకులు ఓటు బ్యాంకుగా చూశారని ఆరోపించారు. ధరణి తీసుకొచ్చి భూముల లావాదేవీల్లో అక్రమాలకు చెక్ పెట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మాకులకు పింఛన్ ఇస్తున్నామన్నారు. తెలంగాణలో కరెంట్ కోత ఉండదని చెప్పారు. ఉద్యమ సమయంలో మోతె గ్రామం మట్టిని ముడుపు కట్టిన విషయాన్నికేసీఆర్ గుర్తు చేశారు. గ్రామాల్లో ఆర్థిక స్థితి పెరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదని, ప్రజలను హితవు పలికారు. ప్రజాసామ్యంలో ప్రజల వద్ద ఉండే వజ్రాయుధం ఓటు అని చెప్పారు. అన్నీ ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed