- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ రాష్ట్రాన్నిఆర్థికంగా లూటీ చేసింది: మంత్రి జూపల్లి
దిశ, కామారెడ్డి : రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా లూటీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ.. ముందుకు వెళుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మద్ది చంద్రకాంత్ రెడ్డి పదవి ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో గ్రంథాలయాలను బలోపేతం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ హయంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే.. ఈ రోజు మేము ఏపని చేయాల్సి వచ్చేది కాదన్నారు. వారి ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీదన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని గ్రాడ్యుయేట్ లందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందనీ, మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. రాష్ట్రంలో మరో 4 లక్షల మందికి దీపావళి తర్వాత రుణ మాఫీ చేస్తామని చెప్పారు. రైతు భరోసా విషయంలో పంట భూముల ప్రక్షాళన జరుగుతున్నందున కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లూటీనీ గ్రాడ్యుయేట్ లు గమనించి..కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను గెలిపించాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్, కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్ బిన్ హందన్, మానాల మోహన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.