- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంచార్జి మంత్రి చెప్తే మేమెందుకు..?
దిశ, కామారెడ్డి : ఇందిరమ్మ కమిటీ పేర్లు మారిపోవడం పట్ల కామారెడ్డి మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు కమిషనర్ ఛాంబర్‌లో కమిషనర్ సుజాతతో వాగ్వాదానికి దిగారు. తాము ప్రతిపాదించిన జాబితాపై ఎండార్స్ చేసి ఇచ్చే వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 49 వార్డులున్నాయి. 49 మంది కౌన్సిలర్లు ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి సోషల్ యాక్టివిటీస్ ఉన్న ఐదుగురు సభ్యుల పేర్లు ఇవ్వాలని అధికారులు చెప్పడంతో అన్ని వార్డుల నుంచి కమిటీ పేర్లు అందజేశారు. అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇచ్చిన పేర్లు కాకుండా ఇతరుల పేర్లు రావడం పట్ల కౌన్సిలర్లు గురువారం కమిషనర్ సుజాత తో వాగ్వాదానికి దిగారు. పేర్లు మార్చాలనుకుంటే తమను ఎందుకు ఇవ్వాలని ఫోన్ చేసారని కమిషనర్‌ను నిలదీశారు. అధికార పార్టీ వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తారా..? మీరు కమిషనర్‌గా పని చేస్తున్నారా.. లేక పార్టీకి పని చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. ఇంచార్జి మినిస్టర్ ఇచ్చిన పేర్లను ఫైనల్ చేశామని కమిషనర్ బదులివ్వడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డిలో ఉన్న వాళ్ళ పేర్లు ఇంచార్జి మంత్రికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అధికార పార్టీ వాళ్ళు వాళ్లకు నచ్చిన పేర్లు ఇస్తే మార్చేస్తారా..? అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పేర్లు ఇవ్వాలని ఫోన్ చేసారని నిలదీశారు. ఇంచార్జి మినిస్టర్ పేర్లు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. కౌన్సిల్ తీర్మానాలు కూడా మీకు నచ్చిన విధంగానే మారుస్తారా.. మాకు విలువ లేదా అని నిలదీశారు. పేర్లు మార్చి కౌన్సిలర్లను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలల నుంచి మున్సిపాలిటీకి ఒక్క రూపాయి రాలేదని, కామారెడ్డి మున్సిపాలిటీ 30 కోట్ల అప్పుల్లో ఉందని, ఇంచార్జి మంత్రిని వచ్చి 49 వార్డుల్లో తిరగాలని చెప్పాలని, సమస్యలు అన్ని ఆయనకే అర్థం అవుతాయన్నారు. తమ ప్రభుత్వం హయాంలో ఇలా ఎప్పుడు జరగలేదని, కౌన్సిలర్లు ఇచ్చిన జాబితానే ఫైనల్ చేశామన్నారు. ఇది సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుల్లో తిరిగి తిరిగి పేర్లు ఇస్తే తమ వార్డులకు సంబంధించిన పేర్లు కాకుండా ఇతర వార్డుల పేర్లు ఇస్తే వార్డుల్లో తాము ఎలా తిరగాలని ప్రశ్నించారు. కమిషనర్ ఒకే విధమైన సమాధానం చెప్పడంతో నేరుగా కలెక్టర్ ను కలిసి అడుగుతామని అక్కడి నుంచి వెళ్లిపోయారు.