- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్క గుంతలోకి దూసుకుపోయింది. నిజామాబాద్ డిపో 1 కు చెందిన బస్సు ప్రమాదానికి గురి కాగా, బస్సు ముందు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఇంత సురక్షితంగా ఉన్నారు. సుమారు 25 మంది బస్సులో ప్రయాణిస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. ఒక్కసారిగా రోడ్డుపై నడుస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు తీసుకోకపోవడంతో బస్సు కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. డ్రైవర్ బస్సు నడుపుతుండగా బ్లడ్ ప్రెషర్ తగ్గడంతో డ్రైవర్ కి కళ్ళు బైర్లు కమ్మాయి. దీంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అటుగా వెళుతున్న వాహన చోదకులు, స్థానికులు ప్రయాణికులు బస్సుల నుంచి బయటపడడానికి సహకరించారు.