- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Solo trip : సోలో ట్రిప్.. సో బెటర్..! ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే సేఫ్
దిశ, ఫీచర్స్ : ఎప్పుడూ బిజీ బిజీగా గడిపేస్తున్న ఆధునిక జీవన శైలితో ఒత్తిడికి గురికావడం సహజమే. ఇలాంటప్పుడే స్ట్రెస్ రిలీఫ్ కోసం కొందరు ట్రిప్‌కి ప్లాన్ చేస్తుంటారు. అందమైన ప్రదేశాలను చుట్టి రావాలని, ఆకట్టుకునే పర్యాటక ప్రాంతాలను వీక్షించాలని భావిస్తుంటారు. అయితే కొంతమంది తమ ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్‌తోనో వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే, మరికొందరు సోలో ట్రిప్పే సో బెటర్ గురూ! అనుకుంటూ ప్రొసీడ్ అవుతుంటారు. ఒకప్పుడు ఎక్కువగా పురుషులే సోలో జర్నీ చేసేవారు. కానీ ఇప్పుడు మహిళలు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నారు. నచ్చిన ప్రదేశానికి ఒంటరి ప్రయాణం చేసేందుకు సిద్ధ పడుతున్నారు. ఇలాంటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
ఇవి ముందే తెలుసుకోండి
మీరు సోలో ట్రిప్‌కు వెళ్లానుకోవడం మంచిదే. అయితే వెళ్లే ముందు మీరు అన్ని విషయాలను ముందుగానే ప్రిపేర్ కావాలి. ముఖ్యంగా మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశం గురించి తెలుసుకోవాలి. అలాగే మీరు వెళ్లబోయే ప్రాంతం ఏది? స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడి చట్టాలు ఏమిటి? మీరు ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవచ్చు?, ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలి? ఈ విషయాలన్నీ ముందుగానే తెలుసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాలంటున్నారు నిపుణులు.
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా..
అసలే ఒంటరి ప్రయాణం కాబట్టి సోలోగా ట్రావెల్ చేయాలనుకునే వారు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్త పడాలంటున్నారు పర్యాటక నిపుణులు. ట్రావెల్ బుకింగ్స్‌తో పాటు మీరు వెళ్లే ప్రాంతంలో ఎన్ని రోజులు స్టే చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. అలాగే అక్కడ హోటల్స్, రిసార్ట్స్, లోకల్‌గా జర్నీ చేసేందుకు అవసరమైన ట్రాన్స్‌పోర్టేషన్ వంటివి ముందుగానే బుక్ చేసుకుంటే తర్వాత టెన్షన్ ఉండదు. ఈ విషయంలో ట్రావెల్ ఏజెన్సీలు ప్యాకేజీలు, ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటాయి. అవి కూడా అవసరమైతే పరిగణించవచ్చు.
ఫ్యామిలీతో షేర్ చేసుకోండి
మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నారనే విషయం గుర్తుంచుకోండి. అందుకే ట్రిప్‌కి వెళ్లే ముందు వెళ్లబోయే ప్రదేశం గురించి, మీరు వెళ్తున్న ప్రాంతాల గురించి కుటుంబ సభ్యులతో చెప్పండి. వారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో వివరించండి. అలాగే మీరు స్టే చేస్తున్న హోటల్స్, ప్రయాణిస్తున్న వెహికల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు పంచుకోవడం మీ భద్రతలో ఒక భాగంగా భావించండి. మహిళలు అయినప్పుడు ఇది ఇంకా ముఖ్యం. ఇక బయటకు వెళ్లేటప్పుడు లైవ్ లొకేషన్ కూడా షేర్ చేయడం ఇంకా మంచిది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఒంటరి ప్రయాణం అందరికీ నచ్చక పోవచ్చు. కానీ కొందరికి ఇదే ఆనందాన్నిస్తుంది. కాబట్టి ట్రిప్‌కు వెళ్లేవారు మీ కంఫర్టబుల్ విషయాలను గుర్తించండి. అవసరం అయితే కుటుంబంతో, సన్నిహితులతో చర్చించండి అంటున్నారు నిపుణులు. అలాగే మహిళలైతే తమకు సౌంకర్యవంతమైన డ్రెస్‌లను ఎంచుకోవాలి. ఇక జర్నీలో ఉండగానో, ఒంటరిగా ఆయా ప్రదేశాల్లో విహరిస్తున్నప్పుడో పూర్తిగా ఫోన్‌లో నిమగ్నమై పోవద్దు. చుట్టు పక్కల పరిసరాలపై ఓ కన్నేసి ఉంచండి. ఈ రోజుల్లో దొంగలు, నేరస్థులు ప్రతీచోటా ఉంటున్నారు. కాబట్టి గోల్డ్, మనీ వంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. లాకర్స్‌లో పెట్టుకోవడం మంచిది. అలాగే మిమ్మల్ని డైవర్ట్ చేసే విషయాల జోలికి వెళ్లవద్దు. హోటల్స్, వెహికల్స్ బుక్ చేసే ముందు, చేశాక అవి సేఫ్టీనో కాదో అని ఒకసారి ఆలోచించడం మర్చిపోవద్దు. ట్రిప్‌కి ముందు వెళ్లబోయే ప్రాంతంలో లోకల్ సిమ్స్, పోర్టబుల్ వైఫై హాట్ స్పాట్స్, పవర్ బ్యాంక్ అవసరం గురించి కూడా ఆలోచించాలి.
మన దేశంలో ట్రావెల్ చేయాలనుకుంటే..
ఇక ఇండియన్స్ అయినా, విదేశాల నుంచి ఇక్కడికి ట్రిప్‌కి వచ్చేవారైనా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఢిల్లీలోని చాందినీ చౌక్ వంటి అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కేర్ తీసుకోవాలి. అలాగే ముంబైలోని నిర్మానుష్య ప్రాంతాలకు కూడా ఒంటరి ప్రయాణం మంచిది కాదంటారు నిపుణులు. ఒక రాజస్థాన్‌లో అయితే టూరిజం పేరుతో అనేక స్కామ్‌లు జరుగుతుంటాయని చెప్తారు. అలాగే నార్త్ ఈస్ట్‌లో ట్రావెల్ చేసేవారు అక్కడ పరిస్థితులు, భద్రతా పరమైన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
ఇవి గుర్తుంచుకోండి
ఏ ప్రాంతానికి వెళ్లినా మిమ్మల్ని తప్పుదారి పట్టించే వ్యక్తులతో, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వీటితోపాటు మీరు ఏ ప్రాంతానికి వెళ్లినా లోకల్ లాంగ్వేజ్, సంస్కృతి, సంప్రదాయాలు, డ్రెస్ కోడ్, ఆహారపు అలవాట్లు వంటివి తెలుసుకుంటే మీకు ఏది అవసరమో, ఎలాంటి కేర్ తీసుకోవాలో అర్థమైపోతుంది. ఆరోగ్యం విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే సోలో ట్రిప్.. సో బెటర్ అంటున్నారు నిపుణులు.