జుక్కల్‌లో ఘనంగా 76వ ఏబీవీపీ ఆవిర్భావ వేడుకలు

by Mahesh |
జుక్కల్‌లో ఘనంగా 76వ ఏబీవీపీ ఆవిర్భావ వేడుకలు
X

దిశ, జుక్కల్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జుక్కల్ శాఖ ఆధ్వర్యంలో జులై 9న ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక బసవేశ్వర చౌక్ వద్ద ఏబీవీపీ పథకవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి వాసరే సతీష్ మాట్లాడుతూ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 1949 జూలై 9న స్థాపించి ఈరోజు దేశంలోనే కొన్ని వేల విద్యార్థి సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థి సంఘం గా ఎదిగి విద్యార్థుల కోసం పోరాడుతుందని అన్నారు.

జ్ఞానం, శీలం, ఏకతా నినాదంతో జాతీయ పునర్నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తూ విద్యార్థి సమస్యలపై అనేక ఉద్యమాలు చేస్తుంది. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు అందించాలని అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఏబీవీపీ పాత్ర కీలకం తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలు మహా పాదయాత్ర, రక్తదానం, విద్యార్థి రణభేరి, విద్యార్థి కధన బేరి వంటి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం లో కీలక పాత్ర పోషించింది

అంతేకాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలపై నీళ్లు నిధులు నియామకాలు కోసం అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించింది. ఏబీవీపీ ప్రారంభమైన నుంచి ఎంతో మంది కార్యకర్తలు చేసి నరహంతక రాక్షసులు నక్సలైట్లకు ఎదురుగా నిలిచి ప్రాణాలు వదిలారు వారికి మా జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు వాగ్మాలు బాలరాజ్, కార్యకర్తలు గజానంద్, వీరేశం, మనోజ్, సాయి, అంజి, సాయిరాం ,మహేష్, కిరణ్, కృష్ణమోహన్, శైలేందర్, ప్రసాద్, దీపక్ వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు కళాశాల విద్యార్థుల విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Next Story

Most Viewed