తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. భారీగా పీఎఫ్ఐ సభ్యుల అరెస్ట్..

by Javid Pasha |   ( Updated:2022-09-22 04:28:08.0  )
తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. భారీగా పీఎఫ్ఐ సభ్యుల అరెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)ను క్రాక్ చేసేందుకు ఎన్ఐఏ భారీ స్థాయిలో సోదాలు ప్రారంభించింది. ఎన్ఐఏ, ఈడీ కలిసి చేసిన ఈ సోదాల్లో భారీ సంఖ్యలో పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. వీటిలో భాగంగా ఎన్ఐఏ, ఈడీ, స్థానిక పోలీసులు కలిసి వివిధ కేసులో పలువురు పీఎఫ్ఐ సభ్యులు, వారికి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఈ అరెస్ట్‌లు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద ఆపరేషన్‌లో ఉగ్రవాద నిధులు, ట్రైనింగ్ క్యాంపులు, ఉగ్రవాద సంస్థల్లో చేరే విధంగా ప్రజలను బలవంతం చేస్తున్నటువంటి వాటిలో హస్తం ఉన్న వ్యక్తులపై దర్యాప్తు సంస్థలు సోదాలు చేశాయి. ఈ సోదాల్లో 200కు పైగా ఎన్ఐఏ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: రూటు మారిన లిక్కర్ స్కామ్.. ఇక్కడ అరెస్ట్ అక్కడ దర్యాప్తు

Also Read: పాతబస్తీలో ఎన్‌ఐ‌ఏ సోదాలు.. పీ‌ఎఫ్‌ఐ కార్యాలయం సీజ్

Advertisement

Next Story