బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు..

by Vinod kumar |
బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన 17 కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు బీసీ గురుకులాల సెక్రటరీ డాక్టర్ మల్లయ్య బట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కొత్తగా ఏర్పాటుచేసిన 17 కాలేజీల్లో వికారాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫిల్మ్ అండ్ మీడియా, యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్, ఫోటోగ్రఫి అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులతో బిఏ(హనర్స్), సంగారెడ్డి కాలేజీలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిగతా కాలేజీల్లో బీఎస్సీ(ఎంసీసీఎస్), బీఎస్సీ(బీజెడ్ సీ), బీకాం, బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఇంటర్ ఉత్తీర్ణులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తాను ఎంచుకున్న కాలేజీకి నేరుగా వెళ్లి డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 33 కాలేజీల్లో రెండు కాలేజీలు సంగారెడ్డి, వికారాబాద్ లోని డిగ్రీ కాలేజీలు కో- ఎడ్యుకేషన్ కాలేజీలు కాగా మహిళా డిగ్రీ కాలేజీలు గద్వాల్, బాన్స్ వాడా( కామారెడ్డి), ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట లో ఏర్పాటు చేశామన్నారు. ఇక నారాయణ పేట, నాగర్ కర్నూలు, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, భువనగిరి బాయ్స్ కొరకు స్పెషల్‌గా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed