- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగ్రవాద సంస్థలతో బజరంగ్ దళ్‌ను పోల్చడం కాంగ్రెస్ కుట్ర: నీరజ్ దునేరియా
దిశ, డైనమిక్ బ్యూరో: పీఎఫ్ఐ వంటి ఉగ్రవాద నేపథ్యం ఉన్న నిషేదిత సంస్థలతో భారత మాత సేవలో తరిస్తున్న బజరంగ దళ్‌ను పోల్చడం దుర్మార్గమని బజరంగ్ దళ్ ఆల్ ఇండియా కన్వీనర్ నీరజ్ దునేరియా తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో భాగంగా ముస్లిం సంతుష్టీకరణ కోసం బజరంగ్ దళ్‌పై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ నీచమైన వ్యవహారమన్నారు. మంగళవారం వీహెచ్పీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నీరజ్ మీడియాతో మాట్లాడారు. దేశం బలం బజరంగ్ దళ్ అని, దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఏటా దాదాపు ఐదు లక్షల మంది కార్యకర్తలు రక్తదానం చేస్తున్నారని, వేలాది మంది హిందూ అమ్మాయిలను దుర్మార్గుల నుంచి కాపాడుతున్నదన్నారు.
లవ్ జిహాద్ రక్కసి కోరలు పీకేందుకు బజరంగ్ దళ్ పని చేస్తుందన్నారు. హిందువులపై విషం కక్కతూ సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ పార్టీకి హిందూ సమాజం తగిన రీతిలో బుద్ధి చెబుతుందని నీరజ్ దునేరియా హెచ్చరించారు. కాంగ్రెస్ దుర్మార్గాలను నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ దిష్టి బొమ్మల దహనం చేస్తుందని, హైదరాబాద్ లోని గాంధీభవన్‌ను ముట్టుడిస్తామని బజరంగదళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు హెచ్చరించారు. కార్యక్రమంలో కుమారస్వామి, వీహెచ్పీ నేతలు పగుడాకుల బాలస్వామి పాల్గొన్నారు