- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సంచలనంగా మారిన నందకుమార్ వాంగ్మూలం
ఫాంహౌజ్వ్యవహారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నందకుమార్ సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో అసలు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, రామచంద్ర భారతి తొలుత ఎక్కడ కలిశారన్న విషయాలు వెల్లడించారు. తనకు సింహయాజీని పరిచయం చేసింది దాసోజు శ్రవణ్అని, ఆ తర్వాత భారతిని కలిశానని వెల్లడించారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే రామచంద్ర భారతిని రోహిత్‌రెడ్డి కి పరిచయం చేసినట్లు స్టేట్మెంట్ఇచ్చారు. టీఆర్ఎస్‌లో అసంతృప్తి కారణంగానే బీజేపీలో చేరేందుకు రోహిత్‌రెడ్డి మొగ్గు చూపారని, అదే సమయంలో మరో ముగ్గురు ఎమ్మెల్యే విషయం ప్రస్తావించినట్లు సిట్ అధికారులకు తెలిపారు. నవంబర్ 10వ తేదీన స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు ఇటీవల హైకోర్టుకు సమర్పించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫాం హౌజ్ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితుల్లో ఒకరైన నందకుమార్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ మాత్రం సంచలనంగా మారింది. సింహయాజీని తనకు పరిచయం చేసిందే దాసోజు శ్రవణ్ (ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉన్నారు) అని ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నెలలో హిమాయత్‌నగర్‌లోని డీ-మార్ట్ పక్కన ఉన్న స్కై వ్యూ హోటల్‌లో పరిచయం చేసినట్లు వెల్లడించారు.
ఢిల్లీలో ఓ ఆలయానికి సింహయాజీతో వెళ్లినప్పుడు రామచంద్రభారతిని మొదటిసారి కలిశానని పేర్కొన్నారు. ఆ పరిచయంతోనే తన కజిన్ అయిన టీఆర్ఎస్ ఎంపీ (జహీరాబాద్) బీబీ పాటిల్‌కు చెందిన ఢిల్లీలోని ఆయన ఇంట్లోనే కలిసి లంచ్ చేశామని తెలిపారు. సైబరాబాద్ క్రైమ్ విభాగం ఏసీపీ రవీందర్, ఇన్‌స్పెక్టర్ భూపాల్, ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్ రాహుల్‌దేవ్ కలిసి నవంబర్ 10వ తేదీన తీసుకున్న వాంగ్మూలంలో నందకుమార్ పై వివరాలను వెల్లడించారు. దీన్నే 'సిట్' ఇటీవల హైకోర్టుకు సమర్పించింది.
రోహిత్‌రెడ్డితో వ్యాపార సంబంధం
జ్యోతిష్యం చెప్పడంలో సింహయాజీకి ఉన్న ప్రావీణ్యంతో తనకు పరిచయం అయిన కొత్తలోనే తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తితో పుట్టిన తేదీని చెప్పానని తెలిపారు. సమస్యలు ఉన్నాయని చెప్తూనే త్వరలో పరిష్కారమవుతాయనే భరోసా ఇచ్చారని, అప్పటి నుంచి ఆయనతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నానని తెలిపారు. తండ్రి నుంచి వచ్చిన వ్యాపార లక్షణంతో హాస్పిటాలిటీ సర్వీసెస్, డెక్కన్ కిచెన్ లాంటి బిజినెస్‌లతో పలువులు వ్యాపారవేత్తలు, వీఐపీలతో పరిచయం ఉండేదని, మంచి భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతో ఆలయాలను సందర్శించడం, పూజారులతో సంబంధాలు ఉండేవని నందకుమార్ తెలిపారు. ఆ క్రమంలోనే హోటల్ బిజినెస్‌లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తమ్ముడు రితేష్‌రెడ్డితో పరిచయం ఏర్పడిందని, ఆయన ద్వారానే ఎమ్మెల్యేతో లింక్ కలిసిందన్నారు.
దాదాపు ఏడు సంవత్సరాల నుంచి రోహిత్‌రెడ్డితో రిలేషన్స్ ఉన్నట్లు తెలిపారు. ఆ చొరవతోనే రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై తరచూ డిస్కస్ చేసుకునేవారమని, లేటెస్ట్ అప్‌డేట్స్ తో పాటు సమాచారాన్ని తీసుకునేవాడినని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ రోహిత్‌రెడ్డి ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్నారని, అందువల్లనే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు రోహిత్‌రెడ్డి పేర్కొన్నారని, కానీ వారి పేర్లను వెల్లడించడానికి మాత్రం నిరాకరించారని నందకుమార్ ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
ఇద్దరి భేటీ మా ఇంట్లోనే..
సింహయాజీతో పరిచయం అయిన తర్వాత తరచూ తన ఇంటికి పిలిపించుకునేవాడినని, అలాంటి సందర్భాల్లోనే రోహిత్‌రెడ్డిని సైతం ఒకసారి పిలిచి పరిచయం చేశానని నందకుమార్ తెలిపారు. రాజకీయ విశ్లేషణలు చేసే లక్షణం ఉండడంతో రామచంద్ర భారతి కూడా తెలంగాణలోని లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ ను రోహిత్‌రెడ్డి ద్వారా తెలుసుకునేవారని వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ తరహాలోనే పొలిటికల్ అనాలసిస్, సర్వేలు చేయడంపై ఉన్న ఆసక్తిని రోహిత్‌రెడ్డికి రామచంద్ర భారతి వివరించి తెలంగాణ రాజకీయ నాయకుల వివరాలను అడిగారని పేర్కొన్నారు. తనతోపాటు రోహిత్‌రెడ్డి కూడా తగినంత సహకారం ఇస్తామనే అప్పుడు చెప్పినట్లు తెలిపారు.
బీజేపీతో నాకు సంబంధాలు లేవు
సింహయాజీ సూచనల మేరకే తన బయోడేటా తయారు చేశానని, ఉద్దేశపూర్వకంగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో గతంలో సర్వీస్ చేసినట్లు రాసుకోవాల్సి వచ్చిందని నందకుమార్ తెలిపారు. నిజానికి బీజేపీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, సింహయాజీ ద్వారానే ఢిల్లీలో జరిగిన వరల్డ్ బ్రాహ్మిణ్ ఫెడరేషన్ సమావేశానికి హాజరైనప్పుడు పలువురు నాయకులు కలిశారని తెలిపారు. కరోనా సమయంలో పేదలకు సేవ చేసినందుకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒకరి ద్వారా గౌరవ డాక్టరేట్ వచ్చిందని, మరో సంస్థ నుంచి కూడా రెండో డాక్టరేట్ వచ్చిందని తెలిపారు. ఆర్ఎస్ఎస్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ రక్షా మంచ్‌తోనూ ఎలాంటి సంబంధాలు లేవన్నారు. కానీ రాజకీయంగా ఉన్నత అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో సింహయాజీ సూచన మేరకు బయోడేటాను కొంత బూస్ట్ చేసి రూపొందించాల్సి వచ్చిందన్నారు.
Also Read...