- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
దిశ, హాలియా: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ సమాజం అభివృద్ధిని సాధిస్తుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి లు అన్నారు. గురువారం హాలియా మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మహిళలు ఆర్థిక పరిపుష్టిని సాధించేలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. ఒక క్యాంటీనే కాకుండా పౌల్ట్రీ, డైరీ, సౌర విద్యుత్తు తదితర రంగాల్లో మహిళలకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలా. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని తెలిపారు. మహిళలు ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నప్పుడే సమాజంలో గౌరవాన్ని పొందుతారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని తెలిపారు. మహిళలు ఎవరికి వారుగా స్వతహాగా వ్యాపారాలు చేయగలిగినప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపల్ చైర్ పర్సన్ ఎడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, కాకునూరి నారాయణ గౌడ్, ఎడవల్లి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు గౌని సుధారాణి రాజా రమేష్, దీపావత్ ప్రసాద్ నాయక్, నలబోతు వెంకటయ్య, వర్ర వెంకటరెడ్డి, పిల్లి ఆంజనేయులు, గౌని రాజా రమేష్, వెంపటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.