రేపటి నుంచి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు

by Naveena |
రేపటి నుంచి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు
X

దిశ, యాదాద్రి భువనగిరి ‌ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం జిల్లాలో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో కందుల సత్యనారాయణ వెల్లడించారు. పదవ తరగతి పరీక్షల కోసం జిల్లాలో 50 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 8632 రెగ్యూలర్ స్టూడెంట్స్, 188 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 19 ప్రైవేట్ స్కూల్స్, 31 గవర్నమెంట్ స్కూల్స్ లో సెంటర్లను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కోసం 50 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు, 50 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 576 ఇన్విజిలేటర్లను నియమించినట్లు డీఈవో వెల్లడించారు.

Next Story

Most Viewed