- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిడ్డ నల్లగా పుట్టడంతో షాక్.. ఆ ఆస్పత్రిపై కేసు.. అసలేం జరిగిందంటే?

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది జంటలకు పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదు. దీంతో సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పిల్లలు లేని ఓ మహిళ కూడా సంతానం కోసం ఫెర్టిలిటీ క్లినిక్‌ను ఆశ్రయించి, IVF పద్ధతిలో గర్భం దాల్చింది. అయితే, డెలివరీ అయ్యాక ఆ మహిళకు ఊహించని షాక్ తగిలింది. దీంతో సదరు మహిళ ఆ ఫెర్టిలిటీ సెంటర్‌పై కేసు నమోదు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
జార్జియాకు చెందిన క్రిస్టెనా ముర్రే అనే 38 ఏళ్ల మహిళ ఫెర్టిలిటీ సెంటర్ సాయంతో 2023లో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ శిశువుగా నల్లగా పుట్టడంతో తన బిడ్డ కాదని, తన గర్భంలోకి వేరే వారి బిడ్డను ప్రవేశపెట్టారని ముర్రే గుర్తించింది. ఇది ఫెర్టిలిటీ క్లినిక్ ఘోరమైన తప్పుగా భావించింది. దీంతో ముర్రే ఆ బిడ్డకు DNA పరీక్ష చేయాలని నిర్ణయించుకుంది. తమ బిడ్డను మోయలేదని, వేరే వారి బిడ్డను కన్నదని DNA టెస్టులో తేలింది. దీంతో మానసికంగా ఎంతో బాధపడింది. అయినప్పటికీ ఆ శిశువుపై ఎంతో మమకారం పెంచుకుంది. అయితే, తనకు డెలివరీ అయినా 5 నెలల తర్వాత తమ బిడ్డ అంటూ ఓ ఆఫ్రికన్ జంట ముర్రేపై పిటిషన్ వేశారు. దీంతో ఆ బిడ్డను వదులుకోవాల్సి వచ్చింది.
అయితే, ఇదంతా ఫెర్టిలిటీ సెంటర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని తెలుసుకుని కోర్టులో క్లినిక్‌పై పిటిషన్ దాఖలు చేసింది. క్లినిక్ నిర్లక్ష్యం వల్ల తను జీవితాంతం మానసిక బాధపడాలని వచ్చిందని ముర్రే పిటిషన్‌లో పేర్కొంది. తాజాగా ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ తమ తప్పును అంగీకరించారు. తమ పొరపాటుకు ముర్రేకు క్షమాపణలు చెప్పారు. అయితే, తనకు జరిగినట్లుగా మరెవరికి జరగకూడదనే ఉద్ధేశ్యంతో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె తెలిపింది.