ప్రజల సొమ్ము..అగ్గి పాలు

by Naveena |
ప్రజల సొమ్ము..అగ్గి పాలు
X

దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండల కేంద్రం మీదుగా నందిపేట్ వెళ్లే రోడ్డులో ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్డు అగ్గి పాలవుతుంది. ప్రజాధనంతో నిర్మించిన ఆర్ అండ్ బి రోడ్లను పర్యవేక్షణ చేయాల్సిన ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యంగా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆలూరు మండల కేంద్రం నుండదేగం మీదుగా వెళ్లే రోడ్డుపైనే దర్జాగా రైతులు పంట చెత్తచెదారాలకు మంటలు పెట్టడంతో రోడ్డు చెడిపోతుంది. ప్రజాధనంతో ప్రజల అవసరాల కోసం ప్రయాణికుల రాకపోకల కోసం నిర్మించిన రోడ్డు అధికారుల నిర్లక్ష్యంతో రైతుల తెలిసి తెలియని పనులతో అగ్గిపాలవుతున్న అధికారుల్లో చలనం కరువైంది. ఈ రోడ్డు గుండా రైతులు పంట దిగుబడులను ఆరబెట్టుకొని చెత్తాచెదారాలను అదే రోడ్డుపై తగలబెట్టడంతో బీటీ రోడ్డు నిర్దాక్షిణ్యంగా చెడిపోతుంది. ఇప్పటికైనా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించి..ఆర్ అండ్ బి రోడ్డుపై మంటలు పెట్టి రోడ్డు ను చెడగొట్టవద్దని అవగాహన కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed