- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pushpa 2 : ముంబై ఈవెంట్ లో పుష్ప రాజ్, శ్రీవల్లి డాన్స్
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా నటించిన సినిమా పుష్ప 2 (Pushpa 2). డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ మేకర్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో మన ముందుకు వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం, ఈ మూవీ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే, తాజాగా ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్ ను మేకర్స్ ముంబై లో నిర్వహించారు. ఇక, ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న సందడీ చేశారు. ముంబై మీడియా అడిగిన ప్రశ్నలన్నింటికీ బన్నీ రష్మిక సమాధానమిచ్చారు. మీడియాతో చిట్ చాట్ చేసిన వీరిద్దరూ ఈవెంట్ అయిపోయేముందు ఫాన్స్ కోరిక మేరకు పుష్ప 2 లోని ‘సూసేకి’ పాటకి స్టెప్పులేశారు. దీంతో ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. బ్లాక్ సారీ లో రష్మిక, బన్నీ సూసేకి పాటకి రెండు స్టెప్పులు వేయడం పై ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.